EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఈనెల 19 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.

    Author SHANKARAVAM NEWS | 16 Nov 2026, 07:38 PM | TELANGANA
     ఈనెల 19 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.

    @ ఈనెల 19 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.
    @ జిల్లాలోని అన్ని కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి- జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపు.

    కుటుంబంలో ఆర్జించే వ్యక్తి చనిపోతే కుటుంబానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం" ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని" అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని అన్ని కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉందని, ఈనెల 19 నుండి వచ్చే నెల 20 వరకు ఆన్లైన్ ద్వారా "ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకానికి" దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
    ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
    ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వ్యక్తి కుటుంబాన్ని పోషించే వ్యక్తి అయి ఉండాలని, 18 నుండి 59 సంవత్సరాల లోపు వయసున్న వారు అర్హులని, కుటుంబంలో పోషించే వ్యక్తి మరణించినట్లయితే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు, కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకుండా భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. వయసు దృవీకరణకు ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుందని, పేద ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి భీమా పొందే వ్యక్తిగా ఉంటారని, కుటుంబంలోని వారు సభ్యులుగా ఉంటారని ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చని, అయితే కుటుంబ పెద్ద నామినీ పేర్లు సమర్పించాల్సి ఉంటుందని, కుటుంబ పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయల జీవిత బీమా అందుతుందని తెలిపారు.
    ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి చార్జీలు, ఫీజులు ,ప్రీమియం లు చెల్లించాల్సిన అవసరం లేదని,కేవలం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. రేషన్ కార్డు ,ఆధార్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్ కార్డు లేని వారు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభమవుతుందని, వచ్చేనెల 20 వరకు ఈ పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో అలాగే మున్సిపల్ వార్డు కార్యాలయాలలో దరఖాస్తులు తీసుకోవడానికి ఏర్పాటు చేయాలని అదేదేశించారు. ప్రతి కేంద్రంలో ఒక సెంటర్ ఇన్చార్జి ని నియమించాలని, ఆన్ లైన్ లో నమోదు చేసిన వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్ లో నమోదు చేయాలని, 3 నుండి 4 క్లస్టర్లు కలిపి ఒక సూపర్వైజర్ ఉంటారని , వీరు గ్రామపంచాయతీ వారిగా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ఆన్లైన్ దరఖాస్తులలో రేషన్ కార్డు ఆధారంగా ముందుగానే వివరాలన్నీ నమోదు చేయబడి ఉంటాయని, జిల్లాలో ఉన్న సుమారు 4 లక్షల 86 వేల కుటుంబాలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం కింద దరఖాస్తుల వివరాలను. ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని, అయితే కుటుంబంలో పోషించే వ్యక్తి, అలాగే నామిని వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని, నామిని మైనర్ అయినట్లయితే బీమా పొందే వ్యక్తి సమ్మతించిన వారిని నామినిగా ఏర్పాటు చేయొచ్చని స్పష్టం చేశారు. అప్లికేషన్ తో పాటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేయాలని, వీటన్నిటిని మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుందని, హార్డ్ కాపీలు ఎంపీడీవో కార్యాలయంలో భద్రంగా ఉంచాలని ఎంపిడిఓ లను ఆదేశించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసే వారి కి సంబంధించి ఇటీవల ఫోటోలు కానీ లేదా ఎలాంటి డిక్లరేషన్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదని, అప్లికేషన్, రేషన్ కార్డు, ఆధార్ ఉంటే సరిపోతుందని తెలిపారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో ఇందిరమ్మ కుటుంబ జీవితా భీమా పథకం గురించి ప్రతి కుటుంబానికి తెలియజేయాలని, ముందుగానే గ్రామాలలో టామ్ టామ్ వేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ భీమా పథకం కింద దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నవంబర్ 19 నుండి డిసెంబర్ 20 వరకు పూర్తి చేయాలని, మండల ప్రత్యేక అధికారులు ఈ పథకాన్ని ప్రతిరోజు స్వయంగా పర్యవేక్షించాలని, జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో ఒకేసారి ప్రారంభం కావాలని చెప్పారు. సూపర్వైజర్ అధికారులుగా ఎంపీడీవో, ఎంఈఓ, తహసిల్దార్, ఏఈపిఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఎంపీవోలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
    స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, సిపిఓ శ్రీనివాస్ నాయక్ ,డిపివోతరుణ్ చక్రవర్తి, తదితరులు ఉన్నారు.