EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • @ ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం

    Author SHANKARAVAM NEWS | 12 Nov 2026, 06:52 PM | TELANGANA
     @ ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం

    @ ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.

    @ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చూస్తాం. @అధికారులందరూ సమస్యలను పరిశీలించాలి-జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ జాతోతు హుస్సేన్ నాయక్
    షెడ్యూల్డ్ తెగల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాతోతు హుస్సేన్ నాయక్ తెలిపారు.

    గురువారం ఆయన నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండలం, గాజీ నగర్‌లో షెడ్యూల్డ్ తెగల సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను తెలుసుకుంటున్నామని ,వివిధ గ్రామాల నుండి అందుతున్న ఫిర్యాదుల్లో ఎక్కువ సమస్యలు ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు.
    దేశంలో .షెడ్యూల్ తెగల ప్రజల హక్కులకు రక్షణ కల్పించేందుకు అనేక చట్టాలు ఉన్నాయని, ఎవరైనా ఎస్టీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చట్ట ప్రకారం కోర్టు ద్వారా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎస్టీ ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులను నిర్భయంగా తెలియజేయాలని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.గాజ్‌నగర్ గ్రామంలో నెలకొన్న రోడ్లు, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆర్‌అండ్‌ఆర్ (పునరావాసం, పునరుద్ధరణ) కింద భూములు కోల్పోయిన బాధితుల వివరాలను సేకరించి అందించాలని ఆదేశించారు. భూ సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించి శుక్రవారం నాటికి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
    ఎస్టీ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించాలని, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఫిర్యాదులు, సమస్యలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.


    ఈ సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఎన్సీఎస్టీ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి ,
    డిటిడిఓ కమలాకర్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి,డిఎంహెచ్ఓ రాహుల్, ఆర్డీవో వనజారని,సర్పంచ్ పార్వతి సత్యనారాయణ ,
    జిల్లా ,మండల అధికారులు ,తదితరులు పాల్గొన్నారు .
    ___________________________
    జారీ చేసిన వారు సహాయ సంచాలకులు ,సమాచారశాఖ, నల్గొండ*