EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చదువుతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలి- రాష్ట్ర ఎస్ సి, ఎస్.టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.

    Author SHANKARAVAM NEWS | 25 Sep 2026, 07:09 PM | ANDHRA PRADESH, TELANGANA
    చదువుతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలి-  రాష్ట్ర ఎస్ సి, ఎస్.టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.

    అంబేద్కర్ చెప్పినట్లు విద్యతో ప్రపంచాన్ని జయించవచ్చని, విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఎస్.సి, ఎస్.టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.విద్యార్థులు ఐఏఎస్, ఇంజనీర్, డాక్టర్, లాయర్ తదితర రంగాల్లో రాణించి భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

    శుక్రవారం ఆయన దేవరకొండ డివిజన్ పరిధిలోని కొండమల్లేపల్లి మండలం, డింజలాల్ తండా బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.

    పాఠశాలలో వంట గది, స్టోర్ రూమ్‌, పరిసరాలను ఆయన తనిఖీ చేశారు.విద్యార్థులకు అందిస్తున్న భోజనం, కూరగాయలు, వంటనూనె, పండ్లు, గుడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
    తర్వాత పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు వాష్‌రూమ్‌లు, కాంపౌండ్ వాల్, బోరు అవసరముందని తెలిపారు.సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అక్టోబర్ 2న గ్రామసభలో తీర్మానం చేసి వీ బిజీ రాంజీ నిధుల కింద పనులకు శంకుస్థాపన చేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బోరు కూడా వేయిస్తామని చెప్పారు.విద్యార్థులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూచించినట్లు తరగతి గదిలోనే తమ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని, క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరారు.
    కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని అన్నారు.
    ప్రభుత్వం సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నందున విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.

    ఇవి కూడా చదవండి

    కమిషన్ సభ్యులు రేణిగుంట ప్రవీణ్, లక్ష్మీ నారాయణ, జిల్లా శంకర్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి, డిటిడిఓ కమలాకర్ రెడ్డి, ఆర్ సి ఓ శ్రీనివాసరావు, ఏ సి ఎం ఓ వెంకటేశ్ నాయక్ ,ఏ టి డి వెంకటేశ్వర్, ఎంపీడీవో స్వర్ణలత, తహసిల్దార్ నరేందర్, ఎంపీ ఓ సుధీర్ కుమార్, సర్పంచ్ గోజి రతన్లాల్ , ఉపసర్పంచ్ శ్రీకాంత్, ప్రిన్సిపల్ శారద ,
    ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.
    __________
    జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*
    [6:26 am, 25/09/2026] Dpro Mbnr: 👆అగ్రికల్చర్ సెక్రటరీ గారి సమీక్ష