చదువుతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలి- రాష్ట్ర ఎస్ సి, ఎస్.టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.

చదువుతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలి- రాష్ట్ర ఎస్ సి, ఎస్.టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. అంబేద్కర్ చెప్పినట్లు విద్యతో ప్రపంచాన్ని జయించవచ్చని, విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఎస్.సి, ఎస్.టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.విద్యార్థులు ఐఏఎస్, ఇంజనీర్, డాక్టర్, లాయర్ తదితర రంగాల్లో రాణించి భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. శుక్రవారం ఆయన దేవరకొండ డివిజన్ పరిధిలోని కొండమల్లేపల్లి మండలం, డింజలాల్ తండా బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో వంట గది, స్టోర్ రూమ్‌, పరిసరాలను ఆయన తనిఖీ చేశారు.విద్యార్థులకు అందిస్తున్న భోజనం, కూరగాయలు, వంటనూనె, పండ్లు, గుడ్లను పరిశీలించి సంతృప్తి...