EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సర్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో 99.95% డిజిటలైజేషన్

    Author SHANKARAVAM NEWS | 07 Aug 2026, 05:57 PM | TELANGANA
    సర్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో  99.95% డిజిటలైజేషన్

    ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ లో భాగంగా పారదర్శక ఓటరు జాబితా రూపొందించడమే ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చేంద్ర శేఖర్ అన్నారు.
    సర్ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, సర్ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్,తదితర అంశాలపై శుక్రవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
    గత వారం నిర్వహించిన సమావేశంలో ఆయా పార్టీల ప్రతినిధులు పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, సర్ కార్యక్రమంపై సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సర్ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ ను ఆయన సమావేశానికి హాజరైన పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు.
    సరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25,2026 నుండి ఆగస్టు 10 వరకు బిఎల్ ఓ ల ఇంటింటి సందర్శన ఉంటుందని, 10 న పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, ఆగస్టు 17 న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, 17 నుండి సెప్టెంబర్ 16 వరకు నెల రోజులపాటు ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాల స్వీకరణ, ఆగస్టు 17 నుండి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాల పరిష్కారం ఉంటాయని, అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ ప్రజాప్రతినిధులకు వివరించారు.
    సర్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో 99.95% డిజిటలైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ వెల్లడించారు. కేంద్ర న్నికల సంఘం ఎన్యూమరేషన్ ఫారాల ఎడిట్ ఆప్షన్ బి ఎల్ వో లకు ఇచ్చినందున, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురితమయ్యే నాటికి ఓటరు జాబితాలో పూర్తి స్పష్టత రావాలని, అర్హులైన ఏ ఒక్క ఓటరు జాబితా నుండి తొలగిపోకూడదని, అలాగే అర్హత లేని వారు జాబితాలో ఉండరాదని చెప్పారు. ఎన్యుమరేషన్ ఫారాల సవరణ పకడ్బందీగా నిర్వహించాలని, ఈ విషయమై అందరికీ తెలిసేలా అవసరమైతే మండల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి మరోసారి రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలని సూచించారు. ప్రతి బిఎల్ఓ ఎన్యుమరేషన్ ఫారాలు కరెక్షన్ చేసి ఇవ్వాలని, నియోజకవర్గస్థాయి బూతు లెవల్ ఏజెంట్లు బిఎల్ఓ స్థాయిలో జరిగే సమావేశాలకు హాజరై ఫారాలు మరో సారి పరిశీలించుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలని కోరారు.
    ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురితం చేయనున్నందున, ఎన్యూమరేషన్ ఫారాల కరెక్షన్ మరియు డిజిటలైజేషన్ ను ఈ నెల 10 లోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.
    ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ రెండు, మూడు పోలింగ్ బూతులు ఒకే చోట ఉన్నట్లయితే ఓటర్లకు దగ్గరయ్యే లొకేషన్ లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని, ఎవరైనా ఓటర్లు తప్పుడు దృవపత్రాలు సమర్పించి ఓట్లు పొందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చనిపోయిన ఓటర్ల తొలగింపు సందర్భంగా మరోసారి పూర్తి స్థాయిలో పరిశీలించి తొలగించాలని, ఓటరు జాబితాలో ప్రముఖుల పేర్లు తప్పుగా ఉన్నట్లయితే సరి చేయాలని సూచించారు.జిల్లాలో సర్ కార్యక్రమాన్ని బిఎల్ ఓ లు పారదర్శకంగా, నిర్దేశించిన సమయం ప్రకారం సమర్థవంతంగా నిర్వహించడం పట్ల బిఎల్ఓ లను, జిల్లా యంత్రాంగాన్ని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అభినందించారు .
    సిపిఐ ఎం నర్సిరెడ్డి,బిజెపి నుండి లింగస్వామి టిఆర్ఎస్ నుండి పిచ్చయ్య,కాంగ్రెస్ పార్టీ నుండి ముంతాజ్ అలీ, ఎన్సీపీ నుండి రఫీక్ , ఏఐఎంఐఎం నుండి ఖాజా గౌస్ మొహియుద్దీన్, బిఎస్పీ నుండి రవిశంకర్, టిడిపి నుండి తేలు అన్న రవి
    తదితరులు మాట్లాడారు.
    ఆర్డీవోలు వై. అశోక్ రెడ్డి, శ్రీదేవి ,పద్మప్రియలు వారి డివిజన్లకు సంబంధించి ఇప్పటివరకు సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ సమాచారాన్ని తెలియజేశారు.
    జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణమూర్తి, ఏ ఈ ఆర్ వో లు, తహసిల్దారులు, డిప్యూటీ తహసిల్దార్లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు .