సర్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో 99.95% డిజిటలైజేషన్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ లో భాగంగా పారదర్శక ఓటరు జాబితా రూపొందించడమే ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చేంద్ర శేఖర్ అన్నారు. సర్ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, సర్ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్,తదితర అంశాలపై శుక్రవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గత వారం నిర్వహించిన సమావేశంలో ఆయా పార్టీల ప్రతినిధులు పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, సర్ కార్యక్రమంపై సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సర్ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ ను ఆయన సమావేశానికి హాజరైన పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు. సరించిన...