EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీ అర్హత.. సీఎం రేవంత్ రెడ్డి

    Author SHANKARAVAM NEWS | 26 Jul 2026, 05:49 PM | TELANGANA
    21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీ అర్హత.. సీఎం రేవంత్ రెడ్డి

    నీట్ పేపర్ లీక్ వివాదానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన పోరాటం గొప్ప విజయమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా నుంచి పీవీ మార్గ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నేడు జెన్ జీ అన్నదమ్ముళ్ల ముఖాల్లో విజయదరహాసం కనిపిస్తోంది. జ‌ెన్ జీ యువ‌త‌ 58 ఇంచుల ఛాతిని ఓడించి విద్యా శాఖ మంత్రి రాజీనామా వ‌ర‌కు తెచ్చారని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా నిరసనలపై కాక్రోచ్ పార్టీ సంచలన ప్రకటన..! కేంద్రం వరుస నిర్ణయాలతో..! నీట్ ప‌రీక్ష ప‌త్రాలు లీక్ కావ‌డంతో ఆత్మహ‌త్య‌లు చేసుకున్న విద్యార్థుల కుటుంబాల‌కు ప‌రిహారం ఇవ్వ‌లేదని.. పోరాటంలో విద్యార్థుల‌పైన పెట్టిన కేసుల‌ను ఎత్తివేయ‌లేదని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యార్థుల‌పైన పెట్టిన కేసుల‌ను ఉప‌సంహ‌రించుకోవాలని.. చనిపోయిన విద్యార్థుల కుటుంబాల‌కు ప‌రిహారం చెల్లించాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.
    ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాతో స‌రిపెట్టుకోకుండా అక్ర‌మ కేసుల‌ను తొల‌గించడానికి, చ‌నిపోయిన విద్యార్థుల కుటుంబాల‌కు సాయం కోసం ఈ ర్యాలీ చేప‌ట్టామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తాం.. ఆగ‌స్టు మొద‌టి వారంలో అసెంబ్లీ, శాస‌న‌మండ‌లి ప్ర‌త్యేక స‌మావేశాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే వ‌యసు 21 ఏళ్లు గా ఉండాల‌ని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పార్ల‌మెంటులో రాహుల్ గాంధీ, మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే నాయ‌క‌త్వంలో ఈ బిల్లును ఆమోదించేలా కృషి చేస్తామన్నారు. జ‌ెన్ జీ యువ‌త విద్యాశాఖ , ఐటీ శాఖ‌ల మంత్రులుగా ఉంటే దేశం ముందుకు పోతుందన్నారు. కేంద్రంలో కూడా విద్యా మంత్రి గా జ‌ెన్ జీ కి అవ‌కాశం క‌ల్పించడానికి రాహుల్ గాంధీ, ఇండియా కూట‌మితో మాట్లాడుతామన్నారు. ప్ర‌పంచానికి జ‌ెన్ జీ గ‌ళం వినిపించాలి.. ఆ దిశ‌గా తాము ప‌నిచేస్తామన్నారు. పార్ల‌మెంటులో ఒక్క శాతం లోపే జ‌ెన్ జీ ప్రాతినిధ్యం ఉందన్నారు.
    ముప్పై శాతం ఉన్న జ‌ెన్ జీ ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో అవ‌కాశం క‌ల్పించాల్సి ఉందన్నారు. 21 యేళ్ల వ‌య‌సులో యువ‌తీ యువ‌కులు చ‌ట్ట‌స‌భ‌ల‌కు పోటీ చేసే అవ‌కాశం ఉండాలన్నారు. జ‌ర్మ‌నీ, బ్రిట‌న్ లాంటి దేశాల్లో 18 ఏళ్ల‌ కే పోటీ చేసే హ‌క్కు క‌ల్పించారని.. సింగ‌పూర్ లో 21 యేళ్ల కే పోటీ చేసి ప్ర‌ధాన మంత్రి కావొచ్చన్నారు ఉద్యమం ముగిసింది కానీ అసలు పోరాటం ముందే ఉంది..కాక్రోచ్‌ల నెక్స్ట్ టార్గెట్! ఈడీ, సీబీఐ లాంటి వాళ్ల‌తో అక్ర‌మ కేసులు పెట్టి రాజ‌కీయ పార్టీలను లొంగ‌దీసుకునే ప్ర‌య‌త్నం చేశారని.. మోదీని, కేంద్రాన్ని గుండె ధైర్యంతో లాఠీలు, తూటాల‌కు ఎదురొడ్డి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ తో రాజీనామా చేయించారని.. వారిని అభినందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సునామీ ఇంతటితో ఆగొద్దని ఆయన తెలిపారు.