21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీ అర్హత.. సీఎం రేవంత్ రెడ్డి
నీట్ పేపర్ లీక్ వివాదానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన పోరాటం గొప్ప విజయమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా నుంచి పీవీ మార్గ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నేడు జెన్ జీ అన్నదమ్ముళ్ల ముఖాల్లో విజయదరహాసం కనిపిస్తోంది. జెన్ జీ యువత 58 ఇంచుల ఛాతిని ఓడించి విద్యా శాఖ మంత్రి రాజీనామా వరకు తెచ్చారని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా నిరసనలపై కాక్రోచ్ పార్టీ సంచలన ప్రకటన..! కేంద్రం వరుస నిర్ణయాలతో..! నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని.. పోరాటంలో విద్యార్థులపైన పెట్టిన కేసులను...