EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రూ.2 లక్షల లంచం తీసుకుంటూ కీసర ఎస్‌ఐ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు!

    Author SHANKARAVAM NEWS | 09 Nov 2026, 11:13 PM | Crime, TELANGANA
    రూ.2 లక్షల లంచం తీసుకుంటూ కీసర ఎస్‌ఐ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు!

    రూ.2 లక్షల లంచం తీసుకుంటూ కీసర ఎస్‌ఐ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు!

    మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ కొండారెడ్డి శ్రీనివాస్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం.

    భూ మోసం, 498A కేసులకు సంబంధించి కోర్టులో చార్జ్‌షీట్లు త్వరగా దాఖలు చేసి, అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    ఇవి కూడా చదవండి

    బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నవంబర్ 9న శిల్పా లేఅవుట్ (శిల్పానగర్ కాలనీ), కీసర–నాగారం పరిధిలో వలపన్ని రూ.2 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఎస్‌ఐను పట్టుకున్నారు.

    లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయనపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

    పోలీస్ శాఖలో అవినీతిపై మరోసారి ఏసీబీ కొరడా!