EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉప్పల శ్రీనివాస్ గుప్తకు ఎమ్మెల్సీ ఇవ్వాలి - మెజారిటీ ఆర్యవైశ్యుల ఆకాంక్ష ఇదేనంటూ డిమాండ్

    Author SHANKARAVAM NEWS | 25 Oct 2026, 10:07 PM | TELANGANA
    ఉప్పల శ్రీనివాస్ గుప్తకు ఎమ్మెల్సీ ఇవ్వాలి -  మెజారిటీ ఆర్యవైశ్యుల ఆకాంక్ష ఇదేనంటూ డిమాండ్

    ఉప్పల శ్రీనివాస్ గుప్తకు ఎమ్మెల్సీ ఇవ్వాలి - మెజారిటీ ఆర్యవైశ్యుల ఆకాంక్ష ఇదేనంటూ డిమాండ్
    హైదరాబాద్: తెలంగాణలో ఆర్యవైశ్యుల రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరింత పెంచే దిశగా ఉప్పల శ్రీనివాస్ గుప్తకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని మెజారిటీ ఆర్యవైశ్యులు కోరుకుంటున్నారని ఆర్యవైశ్య వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    ఆర్యవైశ్యుల సామాజిక, రాజకీయ అంశాలపై ఉప్పల శ్రీనివాస్ గుప్త చురుకుగా పనిచేస్తున్నారని ఆయనకు మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఆర్యవైశ్యుల ఐక్యత, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమం వంటి అంశాలపై పలు సందర్భాల్లో మాట్లాడారు.

    ప్రత్యేకంగా ఆర్యవైశ్యులు వ్యాపార రంగానికే పరిమితం కాకుండా రాజకీయంగానూ ఎదగాలని ఆయన పలు కార్యక్రమాల్లో పిలుపునిచ్చారు.

    ఇవి కూడా చదవండి

    ఈ నేపథ్యంలో ఆర్యవైశ్యులకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించాలంటే ఉప్పల శ్రీనివాస్ గుప్తకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని పలువురు ఆర్యవైశ్యులు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఆర్యవైశ్య వర్గాల్లో వ్యక్తమవుతున్న డిమాండ్