EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలి* - *జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్*

    Author SHANKARAVAM NEWS | 08 Sep 2026, 05:31 PM | TELANGANA
    వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలి* - *జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్*

    *వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలి* - *జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్*

    *---వినాయక చవితి ఉత్సవాలకు జిల్లాలో డి.జె ఏర్పాటుకు అనుమతులు లేవు**

    *---ప్రజలకు,వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా విగ్రహాలను రోడ్డు కు ఇరుపక్కల ప్రతిష్టించుకోవాలి*

    ఇవి కూడా చదవండి

    *---సోషల్ మీడియా పై ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు*

    *వినాయక విగ్రహాల ఏర్పాటు చేయుటకు నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/index.htm నందు వివరాలు పొందుపరచాలి* .

    *---ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసు వారి సూచనలు పాటిస్తూ సహకరించాలి..*


    రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో శాంతియుత వాతావరణం భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దం కలిగించే లౌడ్ స్పీకర్లు,డి.జె లకు అనుమతి లేదని జిల్లా ఎస్పి గారు ఒక ప్రకటనలో తెలిపారు. డి.జే నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయక మండపల వద్ద గాని ఊరేగింపులకు గాని డి.జేలు ఏర్పాటు చేయకూడదని అన్నారు.గణేష్ విగ్రహాల వద్ద నిర్వాహకులు స్పీకర్లను తక్కువ సౌండ్ తో రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని, ఎవరైనా నిర్వాహకులు లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలకు మరియు ఇతర ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగేలా చేయరాదు అన్నారు.మండప నిర్వాహకులు ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా విగ్రహాలను రోడ్డు కు ఇరుపక్కల ప్రతిష్టించుకోవాలనీ సూచించారు.సోషల్ మీడియాలో ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని సోషల్ మీడియా పై ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.మండప నిర్వహుకులు అవసరమైన అన్ని శాఖల అనుమతులు తీసుకోవాలని కోరారు. వినాయక విగ్రహాల ఏర్పాటు చేయుటకు నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/index.htm నందు వివరాలు పొందుపరిచి అప్లికేషన్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని సూచించారు. వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసు వారి చూచనలు పాటిస్తూ సహకరించగలరని కోరారు.

    **గణేష్ మండప నిర్వాహకులు పాటించవలసిన నిబంధనలు:**
    * మండపం ఏర్పాటు చేయు స్థలం వారి యాజమానుల అనుమతులు తీసుకోవాలి.
    * గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి.
    * షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరు ఉపయోగించాలి.
    * గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలి.
    * గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.
    * గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో మంచి నాణ్యత గల స్టేజ్ మరియు షెడ్ ఏర్పాటు చేయవలెను.
    * గణేష్ మండపంలో 24 గంటలు ఇద్దరు వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలి.
    * గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శన దృష్టిలో ఉంచుకుని, మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి.
    * గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట అడటం, అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం, పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం.
    * విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి, పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం సూచనలు చేస్తారు.
    * ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు విదిగా ఏర్పాటు చేసుకోవాలి.
    * మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే తక్షణమే డయల్ 112 గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
    * సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదు, ఎవ్వరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీసు వారికి లేదా డయల్ 112 కి సమాచారం అందించాలి.