EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బ్యాంకులకు సంబంధించిన అక్షరాస్యత అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

    Author SHANKARAVAM NEWS | 24 Aug 2026, 10:34 PM | TELANGANA, తెలంగాణ
    బ్యాంకులకు సంబంధించిన  అక్షరాస్యత అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

    బ్యాంకులకు సంబంధించిన వివిధ కార్యకలాపాలపై ప్రతి ఒక్కరు ఆర్థిక అక్షరాస్యత అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
    సోమవారం అయన ఆర్థిక అక్షరాస్యత అవగాహనపై రూపొందించిన గోడపత్రికను కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.
    ఆయా బ్యాంకుల ద్వారా అందించే సేవలు, బ్యాంకులలో డిపాజిట్, నగదు విత్డ్రా, రుణాల మంజూరు, ప్రభుత్వం ద్వారా అందించే పథకాలకు సంబంధించిన రుణాలు ,ఇతర వివరాలను ఆర్థిక అక్షరాస్యత ద్వారా పొందవచ్చని, ఆర్థిక అక్షరాస్యత వివరాలను తెలియజేసేందుకు జిల్లాలో 9 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు పనిచేస్తున్నాయని, ఈ కేంద్రాలలో పనిచేసే వారు గ్రామాలకు వెళ్లి ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తారని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు .ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా ప్రజలకు ఉచిత ఆర్థిక అవగాహన సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు.
    జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేఎం కరణ్ రెడ్డి ,శిక్షణ సహాయ కలెక్టర్ ఎన్ .శ్రీకాంత్ రెడ్డి, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, డిఆర్ఓ దశరథ్, తదితరులు ఉన్నారు