EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రిన్సిపల్స్ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

    Author SHANKARAVAM NEWS | 19 Aug 2026, 07:01 PM | EDITORIAL, Technology, TELANGANA
        ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రిన్సిపల్స్ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

    ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రిన్సిపల్స్ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
    బుధవారం తన ఛాంబర్లో ఇంటర్ విద్య పై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దశ్రు నాయక్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ తో సమీక్షించారు.
    ప్రభుత్వ జూనియర్ కళాశాలాల్లో మెరుగైన ఫలితాలు వచ్చినప్పుడు ప్రవేశాల సంఖ్య కూడా పెరుగుతుందని కలెక్టర్ అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో ఉన్న 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు గాను 9 కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం పెరిగిందని,నమోదు శాతం తక్కువగా ఉన్న కళాశాలలు ప్రిన్సిపల్స్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి నమోదు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూనియర్ కళాశాలల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుందని ,కళాశాలలో చేరిన విద్యార్థులందరూ మధ్యలో ఇంటర్ కళాశాల మానివేయకుండా చూడాలని ,కనీసం 75% హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా హాజరు శాతం తక్కువగా ఉన్నచోట విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు పంపాలని చెప్పారు. తరగతి గదిలో వెనుకబడిపోయిన విద్యార్థులను గుర్తించి వారికి సాయంత్రము 4 నుండి 5 లేదా మధ్యలో ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, ఒక్కో విద్యార్థిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వారు చదువులో పురోగతిలోకి వచ్చేలా చూడాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులం దరూ తప్పక ఉత్తీర్ణులు కావాలని, ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని అన్నారు. ఇంటర్ విద్య తర్వాత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వృత్తి, ఉద్యోగాలలో స్థిరపడే విధంగా చదువును నేర్పించాల్సిన అవసరం ఆధ్యాపకులు, ప్రిన్సిపల్స్ పై ఉందని చెప్పారు. సెప్టెంబర్లో మరోసారి ఎఫ్ ఎల్ ఎన్ పరీక్ష నిర్వహించాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేపట్టిన పనులపై కలెక్టర్ సమీక్షిస్తూ పనులు ప్రారంభించిన చోట త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.