EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పెద్ది స్వప్నను పరామర్శించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య

    Author SHANKARAVAM NEWS | 01 Aug 2026, 08:03 PM | TELANGANA
    పెద్ది స్వప్నను పరామర్శించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య

    నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న పరమపదించగా, శనివారం వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య నల్లబెల్లిలోని వారి స్వగృహానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

    అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సతీమణి పెద్ది స్వప్నతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

    ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి