డాక్టర్‌ పద్మజకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు

డాక్టర్‌ పద్మజకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు హైదరాబాద్‌: మహిళల నుంచి అక్రమంగా అండాలను సేకరించి రవాణా చేసిన వ్యవహారంలో డాక్టర్‌ పద్మజకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవద్దని హైకోర్టును పోలీసులు కోరారు. ఈ కేసుల్లో ఆమెను ఇప్పటికే నిందితురాలిగా చేర్చామని.. ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కీలకమైన వైద్య, డిజిటల్‌ ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అభ్యంతరం తెలిపారు. ఆమె ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. అండాల అక్రమ సేకరణకు సంబంధించి దాఖలైన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ డాక్టర్‌ పద్మజ హైకోర్టు పిటిషన్‌ దాఖలు...