*మియాపూర్ ధర్మపురి క్షేత్రంలో ఘనంగా కార్తీక మాస వనభోజనాలు*
*మియాపూర్ ధర్మపురి క్షేత్రంలో ఘనంగా కార్తీక మాస వనభోజనాలు* కూకట్పల్లిలోని కన్యకా పరమేశ్వరి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ చైర్మన్ కుమారస్వామి గారి నేతృత్వంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం మియాపూర్లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్తీక మాసంలో వనభోజనాలు నిర్వహించడం మన హిందూ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని శ్రీనివాస్...