జర్నలిస్టుల సంక్షేమానికి టీయూడబ్ల్యూజే కృషి అభినందనీయం -వికారాబాద్ సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
జర్నలిస్టుల సంక్షేమానికి టీయూడబ్ల్యూజే కృషి అభినందనీయం -వికారాబాద్ సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం దశాబ్దాల తరబడి టీయూడబ్ల్యూజే చేస్తున్న కృషి అభినందనీయమని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం నాడు వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాలులో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) వికారాబాద్ జిల్లా తృతీయ మహాసభకు ఆయన ముఖ్య అథితిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో ఎంతో గౌరవప్రదమైన జర్నలిజం వృత్తి పక్కదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై ఉంటుందని స్పీకర్ సూచించారు. ముఖ్యంగా ప్రజలకు పక్షపాతిగా వ్యవహరిస్తూ, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు జర్నలిస్టులు...