మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణిపై ఏసీబీ కేసు.. రూ.6.76 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు!
మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణిపై ఏసీబీ కేసు.. రూ.6.76 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు! 8 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు.. బినామీల పేర్లతో ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఆమె అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు రావడంతో సోమవారం (16-11-2026) ఆమె నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, సన్నిహితులు, బినామీలకు సంబంధించినట్లు భావిస్తున్న మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. రూ.6.76 కోట్ల...