తెలంగాణ జర్నలిస్టులకు తీపి కబురు.. ఇళ్ల స్థలాల పంపిణీపై మంత్రి పొంగులేటి భరోసా

తెలంగాణ జర్నలిస్టులకు తీపి కబురు.. ఇళ్ల స్థలాల పంపిణీపై మంత్రి పొంగులేటి భరోసా తెలంగాణలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు తీపి కబురు వచ్చింది. రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాల కోసం ఆశపడుతున్న మీడియా సమాజానికి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి, జర్నలిస్టులకు నివాసయోగ్యమైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి భూములు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో...