జన గణనలో తప్పులు దొర్లకుండా నిర్వహించాలి:అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్
జన గణనలో తప్పులు దొర్లకుండా నిర్వహించాలి.... @ జనగణనకు ప్రజలు సరైన సమాధానం తెలిపి ఎన్యూమరేటర్లకు సహకరించాలి.. @ జనగణనలో 40 రకాల వివరాల సేకరణ.... @ జిల్లా స్థాయి, డివిజనల్, ఛార్జ్ అధికారులకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహణ-రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్... జనగణనలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో జన గణనపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా , డివిజనల్ స్థాయి అధికారులు,చార్జ్ ఆఫీసర్లుకు (తహసీల్దార్లు), అదనపు చార్జ్ ఆఫీసర్లు (ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు) రెండు రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో...