సామాన్యుడికి బిగ్ షాక్.. రాత్రికి రాత్రే పెరిగిన బియ్యం ధర, ఇప్పుడు బస్తా రేటు ఎంతంటే?
సామాన్యుడికి బిగ్ షాక్.. రాత్రికి రాత్రే పెరిగిన బియ్యం ధర, ఇప్పుడు బస్తా రేటు ఎంతంటే? సామాన్యుడి సంచికి భారీ చిల్లు పడుతోంది. ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు సన్న బియ్యం ధరలు అశనిపాతంగా మారుతున్నాయి. అన్నం ఉడికితే గానీ పూట గడవని బతుకుల్లో, ఇప్పుడు ఆ బియ్యం కొనాలంటేనే గుండె గుభేల్మంటోంది. గడిచిన నెల రోజులుగా బియ్యం ధరలు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సామాన్యుల పాలిట ఇదొక పెనుభారంగా పరిణమిస్తోంది. పేద, మధ్యతరగతి వర్గాల కుటుంబ బడ్జెట్ తలకిందులు అవుతోంది. మార్కెట్లో సన్న బియ్యం ధరల మంటలు తీవ్రస్థాయికి చేరాయి....