హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేవారికి బిగ్ అప్డేట్.. ఈ విషయాలు తెలుసుకోండి..!

దసరా పండగకు వేళైంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండగను తమ ఇళ్లల్లో జరుపుకోవాలని నగరవాసులంతా పల్లెబాట పట్టారు.రేపు ఆదివారం సద్దుల బతుకమ్మ అలాగే సోమవారం మహర్నవమితో పాటు మంగళవారం విజయ దశమి కావడంతో ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లోని జాతీయ రహదారులపై వాహనాల రద్దీ భారీగా నెలకొంది. హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీ పెరిగిపోయి 3 కిలోమీటర్ల నుంచి వాహనాలు ఆగిపోయాయి. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పట్టణాన్ని దాటాలంటే ఒక్కో వాహనదారుడికి దాదాపు 45 నిమిషాలకు పైగా సమయం పడుతున్నట్లు సమాచారం....