సమాచార హక్కు చట్టాన్ని నల్గొండ జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంలో జిల్లా అధికారులు

సమాచార హక్కు చట్టాన్ని నల్గొండ జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంలో జిల్లా అధికారులు ,పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, సహాయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ల కృషి వల్లనే జిల్లాకు అవార్డు వచ్చిందని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. సమాచార హక్కు చట్టం అమలులో భాగంగా నల్గొండ జిల్లాలో సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 (1) బి కింద సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకుగాను శుక్రవారం జిల్లా కలెక్టర్ హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్ల చేతులమీదుగా అవార్డుతో పాటు, జ్ఞాపికను అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని అధికారులు , సిబ్బంది, ఆయా...