వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..*

*వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..* దేవరకొండ మండలం కొమ్ముతండాభీమనపల్లిలోని భీమనపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి సంబంధించి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌తో కలిసి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారు ఆదివారం నిమజ్జన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, వినాయక విగ్రహాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు...