ఏసీబీకి చిక్కిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు! రిటైర్డ్ ఉద్యోగికి రావాల్సిన రూ.27.54 లక్షల బకాయిల కోసం రూ.2.5 లక్షల లంచం డిమాండ్.. 🚨
రిటైర్డ్ ఉద్యోగికి రావాల్సిన రూ.27.54 లక్షల బకాయిల కోసం రూ.2.5 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు! 🚨 చేవెళ్ల అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ (ఏటీవో) కావలి అనూరాధ, సబ్ ట్రెజరీ అధికారి (ఎస్టీవో) మాడిగ లక్ష్మయ్యలను ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగి జంగయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ అంగిళ్ల ఆనందకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్లలో గ్రామ కార్యదర్శిగా పనిచేసిన ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. గతంలో ఆయన సస్పెన్షన్‌కు గురికాగా, కోర్టులో ఊరట లభించింది. దీంతో సస్పెన్షన్ కాలానికి సంబంధించిన వేతనం,...