ఈ కొత్త ఛార్జ్ చూశారా? క్యాష్ ఆన్ డెలివరీ అంటే బాదుడే
ఫుడ్ లవర్స్ కు ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం 'జొమాటో' ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటికే రెస్టారెంట్ ఛార్జీలు, ప్యాకేజింగ్ ఫీజులు, ప్లాట్‌ఫామ్ ఫీజులు, డెలివరీ ఛార్జీలు, జీఎస్‌టీ భారాన్ని మోస్తున్న కస్టమర్లపై మరో కొత్త ఛార్జ్ మోపింది. ఇకపై ఫుడ్ డెలివరీ అయిన తర్వాత చేతికి నగదు ఇచ్చే 'క్యాష్ ఆన్ డెలివరీ' (COD) ఆప్షన్ ఎంచుకుంటే ప్రత్యేకంగా అదనపు ఛార్జీ వసూలు చేయడం ప్రారంభించింది. కస్టమర్ల నుంచి వచ్చే ప్రతి రూపాయిని వదలకుండా రాబట్టుకునేందుకు కంపెనీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఏంటి ఈ కొత్త 'పే ఆన్ డెలివరీ' ఛార్జ్? సాధారణంగా ఆన్‌లైన్ పేమెంట్లు చేయకుండా, ఫుడ్ డోర్ ముందుకు వచ్చాక...