గణేశ్‌ మండపాలు ఏర్పాటు చేయాలంటే ఇవి తప్పనిసరి: సీపీ సజ్జనార్

గణేశ్‌ మండపాలు ఏర్పాటు చేయాలంటే ఇవి తప్పనిసరి: సీపీ సజ్జనార్ మరో వారం రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. గణేష్ ఉత్సవాలు అంటే హైదరాబాద్ లో గల్లీ గల్లీకి వినాయకుని విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. అయితే గణేష్ మండపాల వివరాలను ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగానే ఆన్‌ లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాలని హైదరాబాద్‌ సిటీ పోలీస్ పేర్కొంది. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా నిర్వాహకులు వెంటనే అధికారిక పోర్టల్ అయిన policeportal.tspolice.gov.in ను సందర్శించి మండపం, నిర్వాహకుల వివరాలను నమోదు చేసుకోవాలని సూచనలు చేసింది. మండపాల ఏర్పాటు స్థలం, విద్యుత్ కనెక్షన్లు, విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ తదితర పూర్తి వివరాలను...