*రోశయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి*
*కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త* పైడా కృష్ణ ప్రసాద్ మిత్రబృందం మరియు ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆల్ ఇండియా రేడియో జంక్షన్ వద్ద సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించిన కీ.శే. గౌరవ శ్రీ కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర HRD, IT & Electronics శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ...