అన్నా, చెల్లెలు, అక్క, తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా సంవత్సరానికి ఒకసారి జరుపుకునే గొప్ప పండుగ రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) అని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

అన్నా, చెల్లెలు, అక్క, తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా సంవత్సరానికి ఒకసారి జరుపుకునే గొప్ప పండుగ రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) అని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. సోదరికి తన సోదరుడు కలకాలం రక్షగా, తోడుగా ఉంటాననే నమ్మకాన్ని, భరోసాను రాఖీ పండుగ ద్వారా కల్పిస్తాడని,అదే నమ్మకంతో అక్కా,చెల్లెళ్లు తన సోదరులకు రక్షాబంధన్ కడతారని తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రం పాన్గల్ లో ఉన్న చారుమతి అనాధాశ్రమ బాలికలు జిల్లా కలెక్టర్ ను కలెక్టర్ కార్యాలయంలో కలిసి రాఖీలు కట్టారు. సోదరీ, సోదరుల ప్రేమానుబంధాలతోపాటు, వారికి రక్షగా నిలుస్తామనే భరోసాను కల్పించే రాఖి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు జిల్లా...