ఏసీబీకి చిక్కిన రూ.100 కోట్ల అవినీతి తిమింగలం
TG: మరో భారీ అవినీతి తిమింగలాన్ని ACB అధికారులు పట్టుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైనింగ్ శాఖ AD జయరాజ్, అతని బంధువుల ఇళ్లపై దాడులు చేసి రూ.100 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. HYD, సూర్యాపేట్, తాండూరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. HYDలో జరిపిన తనిఖీల్లో 2ఇళ్లు, రూ.40లక్షల నగదు, రూ.20 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, 5 ఎకరాల భూమి, 400 గ్రాముల గోల్డ్ను గుర్తించామని అధికారులు తెలిపారు.