లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చందానగర్ ఎస్‌ఐ, కానిస్టేబుల్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చందానగర్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ హైదరాబాద్: లంచం తీసుకుంటూ చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ బండెల బాల్‌రాజ్, పీసీ-7491 బి. రాఘవేంద్రపై లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. క్రైం నంబర్ 696/2026 కేసు దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేయడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.75 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ క్రమంలో శనివారం (ఆగస్టు 22) రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఎస్‌ఐ బండెల...