ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందించడమే లక్ష్యంమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందించడమే లక్ష్యంమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా, త్రిపురారం మండలం, లోక్యతండ గ్రామాన్ని సందర్శించి ఇంటింటా కాలినడకన తిరుగుతూ గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ అందించడమే తమ లక్ష్యమన్నారు.గ్రామ సమస్యలు, ముఖ్యంగా ఎస్ సి,ఎస్టీ వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.గ్రామ పర్యటనలో ముందుగా దాస్ అనే రైతును కలెక్టర్ పలకరిస్తూ ఎంత భూమిలో పంట సాగు చేస్తున్నారని? అడిగి తెలుసుకున్నారు. ఒక...