నల్గొండ జిల్లా నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ దారుణ హత్య ఘటనను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్

“నల్గొండ జిల్లా నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ దారుణ హత్య ఘటనను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ – నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేసి నివేదిక సమర్పించాలని ఎస్పీకి ఆదేశం” ************ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం, జేబీ కాలనీలోని తన నివాసంలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్ శ్రీమతి కుల్లు రూపా రెడ్డి దారుణ హత్యకు గురైన ఘటనను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ గౌరవ చైర్‌పర్సన్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నప్పటికీ నిందితులను ఇంకా గుర్తించక పోవడం...