ఆగస్టు 17నుండి ఏపీ అసెంబ్లీసమావేశాలు.. సీఎం చంద్రబాబు మంత్రులకు అలెర్ట్ అందుకే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. మెగా డీఎస్సీ పైన, సాయి కృష్ణ లాకప్ డెత్, శాంతిభద్రతల పరిరక్షణ, రైతుల సమస్యలు తదితర అంశాల పైన రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తలపెట్టింది ఈనెల 17వ తేదీన ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలు, అజెండాను ఖరారు చేస్తారు. అయితే ఈ వర్షాకాల సమావేశాలను...