రూ.3.25 లక్షల నగదు, స్కూటీ, చోరీ పరికరాలు స్వాధీనం – మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక గాలింపు -అడిషనల్ ఎస్పి జి.రమేష్
పగటి పూట తాళం వేసి ఉన్న ఇండ్లను, అపార్ట్ మెంట్‌లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన నల్లగొండ సబ్ డివిజన్ పోలీసులు నల్లగొండ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస పగటి పూట చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన నల్లగొండ I టౌన్, II టౌన్ పోలీసుల సమన్వయంతో అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఒక ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి కేసును ఛేదించారు. నిందితుడి వద్ద నుంచి రూ.3.25 లక్షల నగదు, ఒక స్కూటీ, చోరీలకు ఉపయోగించిన ఇనుప రాడ్లు, మాస్క్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి...