అంతర్రాష్ట్ర దొంగ ముఠాకు చెక్.. ఢిల్లీ దొంగను నల్గొండలోనే పట్టేసిన ఖాకీలు..!
రూ.3.25 లక్షల నగదు, స్కూటీ, చోరీ పరికరాల స్వాధీనం.. పరారీలో మరో ఇద్దరు నిందితుల కోసం రాష్ట్రాల మధ్య గాలింపు.. దొంగలను పట్టేందుకు ఉత్తరప్రదేశ్,ఘజీయబాద్, ఢిల్లీ లో ఖాకీ సినిమా రేంజి లో జల్లెడ పట్టిన నల్గొండ వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఎస్సై సైదా బాబు.. నల్గొండలో వరుస పగటి చోరీలతో ప్రజల్లో భయాందోళన నెలకొన్న వేళ.! ఖాకీ సినిమా క్లైమాక్స్‌ను తలపించే రీతిలో ఆపరేషన్ నిర్వహించి అంతర్రాష్ట్ర దొంగ ముఠాకు భారీ షాక్ ఇచ్చారు... జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో, అదనపు ఎస్పీ జి. రమేష్, డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో...