తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్

తిరుమలకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఇక, పండుగలు.. సెలవుల రోజుల్లో వీరి సంఖ్య మరింత ఎక్కువ... దీంతో.. ఆ సందర్భాల్లో క్యూకాంప్లెక్స్‌లు, క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. వారికి శ్రీవారి సేవకులు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలను చేరవేస్తుంటారు. అయినప్పటికీ.. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో క్యూ లైన్లలో ఉన్న భక్తులకు వేగంగా ప్రసాదాలు అందించటం కష్టంగా మారుతోంది. దీంతో.. వీరి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సరికొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు అన్నపానీయాలు అందించేందుకు ఫుడ్ సర్వింగ్ కన్వేయర్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. రద్దీ రోజుల్లో దాదాపు...