అరుణాచలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ - కొత్త నిబంధనలు, టైమింగ్స్..
అరుణాచలం. లక్షలాది మంది భక్తులు నిత్యం దర్శనం కోసం వచ్చే పవిత్ర ప్రదేశం. పౌర్ణమి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఇక్కడ గిరిప్రదక్షిణకు భక్తులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ గిరి ప్రదక్షిణ మార్గంలోనే మోక్ష మార్గం కు విశిష్ఠత ఉంది. దీంతో.. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ మోక్ష మార్గంలోకి వెళ్ళి .. బయటకు రావటం ప్రత్యేకంగా భావిస్తారు. కాగా,ఈ మధ్య కాలంలో ఇక్కడ చోటు చేసుకున్న కొన్ని ఘటనల తో అధికారులు కొన్ని నిబంధనలు మార్పు చేస్తూ.. టైమింగ్స్ ఖరారు చేసారు. అరుణాచలం ఆలయానికి ఈ మధ్య కాలంలో విశేష ఆదరణ పెరిగింది. పెద్ద సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి భక్తులు...