నల్గొండ కు త్వరలో వెయ్యి కోట్ల నిధులు వస్తాయన్న మంత్రి...!

త్వరలో కేంద్రం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రత్యేకనిధులు ఇచ్చే అవకాశం ఉందని, నల్గొండ అభివృద్ధి దీనివల్ల సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నుంచి సుమారు రూ.1,000 కోట్ల ప్రత్యేక నిధులు వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈ నిధులు అందితే నల్గొండ పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం నల్గొండ తహసిల్దార్ కార్యాలయంలో...