జనంపల్లి బాలికల గురుకుల పాఠశాలలో 6, 7, 8 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 6వ, 7వ, 8వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కె. నాగమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జనంపల్లి లోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో దరఖాస్తులను సమర్పించాలని ఆమె కోరారు.దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, బోనాఫైడ్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా జత చేయాలని సూచించారు.దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఆగస్టు 5వ తేదీ (బుధవారం)...