'ఎల్లమ్మ' ఫస్ట్ లుక్ రేపే.. దేవి శ్రీ ప్రసాద్ లుక్స్ కు గూస్ బంప్స్ పక్కా..!
'బలగం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు దర్శకుడు వేణు యెల్దండి. ఇప్పుడు ఆయన 'ఎల్లమ్మ' అనే సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో 'పర్షి' అనే పాత్రలో ప్రముఖ మ్యుజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా నటిస్తున్నారు. దాంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీ నుంచి దేవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆగస్టు 2 న చిత్ర యూనిట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. హీరోగా దేవీశ్రీ ప్రసాద్ ఇదే సినిమాతో...