వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తుండడం, అలాగే తక్కిన ప్రాంతాలలో భారీ వర్షాలు వచ్చేందుకు అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం అయన హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి అధికారులెవరు సెలవు పై వెళ్లవద్దని, అందరు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాలలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్...