ఉమ్మడి నల్గొండ జిల్లాలో 489 కానిస్టేబుల్ ఉద్యోగాలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీస్, అగ్నిమాపక శాఖలో పలు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి. నల్గొండ జిల్లాలో సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 251, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు 10, ఫైర్మెన్ పోస్టులు 13 ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో సివిల్ 160, ఏఆర్ 16, ఫైర్మెన్ 10 పోస్టులు ఉన్నాయి. యాదాద్రి జోన్లో ఫైర్మెన్ పోస్టులు 16, జైళ్ల శాఖలో కానిస్టేబుల్ పోస్టులు 13 ఖాళీల భర్తీ అవనున్నాయి