సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం: సమాచార అధికారి (PIO)కి ₹2,000 జరిమానా, వారం రోజుల్లో సమాచారం ఇవ్వాలని రాష్ట్ర సమాచార కమిషన్ తీవ్ర ఆగ్రహం!*

సమాచార హక్కు చట్టం-2005 (RTI) కింద కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అందించకుండా నిర్లక్ష్యం వహించినందుకు నల్గొండ జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి కార్యాలయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO) పై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం (29-07-2026) హైదరాబాద్ మోజంజాహి మార్కెట్‌లోని సమాచార హక్కు భవన్‌లో గల కోర్ట్ హాల్‌-2 లో జరిగిన విచారణకు అప్పీలుదారు, *RTI SS (రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ) జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కె. బాబూరామ్ నాయక్* హాజరయ్యారు. అప్పీల్ సంఖ్య 10301/SIC-MP/2026 కు సంబంధించిన ఈ కేసును విచారించిన రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీమతి...