విధి నిర్వహణలో గాయపడిన కానిస్టేబుళ్లకు సీపీ సజ్జనర్ పరామర్శ

విధి నిర్వహణలో భాగంగా డ్రగ్స్ తనిఖీల సమయంలో గాయపడిన హెచ్-న్యూ కానిస్టేబుళ్లు ఎన్.మహేందర్ యాదవ్, ఎమ్.వంశీధర్‌లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పరామర్శించారు. మంగళవారం లంగర్‌హౌజ్, ప్రశాంత్‌నగర్‌లోని ఆ కానిస్టేబుళ్ల ఇళ్లకు స్వయంగా వెళ్లి.. వారి ఆరోగ్య పరిస్థితిని, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వారు చూపిన తెగువను ప్రశంసించారు. వారికి మనోధైర్యం కల్పిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ పరామర్శలో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ కూడా సీపీ వెంట ఉన్నారు. ఈ నెల 26న ఆబిడ్స్ తిలక్‌రోడ్డు ప్రాంతంలో...