ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సత్వరమే పరిష్కరించడo ప్రతి శాఖాధికారి బాధ్యత -రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్

ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సత్వరమే పరిష్కరించడo ప్రతి శాఖాధికారి బాధ్యత అని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు. ప్రజావాణి లో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్షిస్తూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలని అన్నారు.ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. అధికారులందరూ సమయపాలన పాటిస్తూ విధులను నిర్వహించాలని అన్నారు.అన్ని శాఖల అధికారులు తమ శాఖల నెలవారీ ప్రగతి నివేదికలను (మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్) ఆగస్టు 3లోగా జిల్లా ప్రణాళిక అధికారి (సీపీఓ)కి...