ధనుష్ పొలిటికల్ ఎంట్రీ- ఫ్యాన్స్ కు పిలుపు
ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో చర్చకు దారితీశాయి. తన అభిమాన సంఘాలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు, చేసిన సూచనలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. త్వరలోనే ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారనే ఊహాగానాలకు బలాన్ని చేకూర్చాయి. సినిమాలు, ప్రచార వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా చురుగ్గా సమాజ సేవలో భాగస్వామ్యులు కావాలని అభిమానులకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అభిమానులందరూ ఒకే చోట చేరడం వల్ల ఏర్పడే ఐక్యతకు ఒక గొప్ప శక్తి ఉంటుందని, ఈ ఐక్యతకు ఒక మంచి ప్రయోజనం, దిశదశను తీసుకురావడానికి ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు....