ఉత్తర తెలంగాణకు గేమ్‌చేంజర్.. రూ.2,278.14 కోట్లతో ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్ - మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మరో కీలక అడుగు పడిందని రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్‌లో ప్రతిష్ఠాత్మక జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటుకు రూ.2,278.14 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009.23 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో 1,609.23 ఎకరాలు భారత వైమానిక దళం (IAF) అవసరాల కోసం, 400 ఎకరాలు సివిల్ ఏవియేషన్ ఎన్‌క్లేవ్, ఎంఆర్ఓ (MRO), కార్గో టెర్మినల్, హ్యాంగర్లు, భవిష్యత్ విస్తరణ అవసరాల కోసం కేటాయించనున్నట్లు తెలిపారు. భూసేకరణతో పాటు ఇప్పటికే...