హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుదేలైందనే ప్రచారంలో నిజం లేదు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ కొంతమంది ఉద్దేశపూర్వకంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉన్న స్పష్టమైన గణాంకాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. గత రెండున్నరేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనలో 15 నుంచి 20 శాతం రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరిగిందని, ప్లాట్ల విక్రయాలు ఏకంగా 40 శాతం వరకు పెరిగాయని వెల్లడించారు. గత పదేళ్ల పాలనతో పోలిస్తే ఈ రెండున్నరేళ్లలోనే రెసిడెన్షియల్ మార్కెట్ విశేషంగా పుంజుకుందని తెలిపారు. 2004-2014 మధ్య నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల దూరదృష్టి వల్లే ఓఆర్‌ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం,...