అరుణాచలం లో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ కి చెందిన భక్తుడు మృతి
అరుణాచలం లో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ కి చెందిన భక్తుడు మృతి తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ మోక్ష మార్గం లో ఇరుక్కుపోయిన ఆంధ్రప్రదేశకు చెందిన ఓ భక్తుడు ఊపిరాడక మృతిచెందాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మణికుమార్ (36) తన కుటుంబ సభ్యులతో కలిసి తిరువణ్ణామలైలోని శ్రీ ఉన్నాములయ్యమ్మన్ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వెళ్లాడు. అనంతరం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయానికి చేరుకున్నాడు. దీన్ని మన తెలుగువారు మోక్ష మార్గం అని పిలుస్తారు. గుహ ఆకారంలో ఉండే ఈ ఆలయంలో భక్తులు వెనుక ద్వారం...